వికలాంగుల పెన్షన్ రూ.6 వేలు,వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట MRPS నాయకుల ఆద్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS జిల్లా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలవుతున్నా పింఛన్లు పెంచలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే దివ్యాంగులు అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.