బందరు గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆస్తులను పర్యవేక్షిస్తాం: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్తానిక మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆస్తులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంగళవరం రాత్రి 7 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లు అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విజయవాడలో ఉన్న 40 ఎకరాల భూమిని విజయవాడ ఉత్సవ్ పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు వినియోగిస్తామని కలెక్టర్ ఎండోమెంట్ కమిషనర్ కు ప్రతిపాదనలు పంపితే కమిషనర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారన్నారు.