ప్రేమపేరుతో బాలికను వేధించిన యువకుడి పై పోక్సో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ రాంచందర్రావు తెలిపారు. అర్నకొండకు చెందిన టి.రంజిత్ నాలుగు నెలల క్రితం ఇంస్టాగ్రామ్ లో కరీంనగర్ లో చదువుతున్న ఒక బాలికతో పరిచయం చేసుకున్నాడని అన్నారు. రెండు నెలల నుంచి బాలికను ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తూ శుక్రవారం బాలికకు ఫోన్ చేసి కరీంనగర్ కలవాలని తెలిపాడని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచంద్రరావు తెలిపారు.