మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు వైద్య శిబిరాన్ని డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామంలో ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడాన్ని గ్రామస్తులు స్వాగతించారు ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు గ్రామస్తులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కలిగించారు గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు.