ఇందిరా మహిళ డైరీ లబ్దిదారులకు స్వయం ఉపాధికి అందించే పాడి పశువుల కొనుగోలు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మధిర నియోజకవర్గం లో 5 మండలాలలో పైలట్ ప్రాజెక్టు గా అమలులో భాగంగా ఇందిరా మహిళ డెయిరీ పాడి పశువుల కోనుగొలు టీం సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి పాల్గొని, కమిటి సభ్యులకు దిశానిర్దేశం చేశారు.