కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎం విద్యా సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థను వినియోగదారునికి సౌకర్యంగా ఉండేలా రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ట్రిపుల్ ఐటీ డిఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ కు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పరిశీలించారు..