ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, కూటమి ప్రభుత్వం రైతు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం మండలం తండెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ తో కలిసి ఆయన రైతు సేవా కేంద్రంలో ఎరువులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 23 వేల మెట్రిక్ పనుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో మరో 3 వేల మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు.