పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులను ఈ పండుగ అయిపోయిన వెంటనే ప్రారంభించి, వచ్చే ఏడాది పండుగ నాటికి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సుమారు రూ.కోటి 80 లక్షలతో ఈ అభివృద్ధి పనులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పనులకు టెండర్లను పిలవడం జరిగిందని, చండీయోగం ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. అమ్మవారి పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు ఈ ఏడాది కూడా భక్తులకు పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శన