తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యదర్శి నాగేంద్రబాబు, సిపిఎం నాయకులు రియాజ్ మాట్లాడుతూ అమెరికా భారత దిగుమతులపై విధిస్తున్న 50 శాతం సుంకాలను వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. అమెరికా పన్నులు ఆక్వా, టెక్సటైల్ రంగాలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మోడీ ప్రభుత్వం మౌనం వహించడం దేశ సార్వభౌమత్వానికి భంగమని విమర్శించారు. జీఎస్టీ తగ్గింపు పై ప్రభుత్వ ద్వందో వైఖరిని తప్పుపడుతూ అమెరికా విధానాలకు బహిరంగంగా వ్యతిరేకించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష సంఘాల నేతలు పాల