ప్రైవేట్ పాఠశాలలో ఎనిమదవ తరగతిలో చదువుతున్న విద్యార్థి పై ఉపాధ్యాయుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థి నరేష్ మరియు మరో విద్యార్థి మధ్య సరదాగా జరిగుతున్న సంభాషణపై దాడి చేసినట్లు తండి ఆదినారాయణ ఆరోపించారు. మంగళవారం ఉదయం పాఠశాలలో సోషల్ టీచర్ మోహన్ దాడి చేసి చేయి విరగ గొట్టారని తెలిపారు. అప్పటినుండి టీచర్ మోహన్ అప్పటినుండి పరారిలో ఉన్నారని అన్నారు. చేయి విరిగి విద్యార్థి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. పాఠశాల యాజమాన్యం కనీసం స్పందించలేదని నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని అన్నారు.