ప్రకాశం జిల్లా బేస్తవారిపేట లో జరిగిన హత్య ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈనెల మూడవ తేదీన స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు వెళ్లిన బ్రహ్మయ్యను హత్య చేశారు. కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన బ్రహ్మయ్యను హత్య చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే పలు కోణాలలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం ద్వారా సాక్షాలు సేకరించామని డిఎస్పి అన్నారు. ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్య కాదని డిఎస్పి నాగరాజు తెలిపారు.