రైల్వే కోడూరు లో ఇద్దరు బంగారు వ్యాపారులను నకిలీ బంగారంతో మోసం చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బస్టాండ్ సమీపం లోని ఒక ఆభరణాల దుకాణంలో ఓ మహిళ నకిలీ బంగారు బ్రాస్లెట్ ఇచ్చి 1,60 వేల తీసుకుందని, మార్కెట్ వీధి లోని దుకాణంలో మరో వ్యక్తి నకిలీ బ్రాస్లెట్ ఇచ్చి 2.16 వేల రూపాయలు తీసుకెళ్ళాడని తెలిసింది. తాము మోసపోయామని వ్యాపారస్తులు గుర్తించేలోపు వారు పరారయ్యారు. రెండు బ్రాస్లెట్లు ఇంచుమించు ఒకేలా ఉండడం గమనార్హం. వ్యాపారస్తులు పోలీసులు ఆశ్రయించారు.