ఆళ్లగడ్డలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో డీఎస్పీ ప్రమోద్ శక్తి టీమ్ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శక్తి యాప్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బాల్య వివాహలపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ యుగంధర్, ఎస్సై నగీనా, ప్రిన్సిపల్ ఫిర్టోస్ పాల్గొన్నారు.