గ్రూప్ 1 పరీక్షలు అవకతవకలపై నిరసనలో పాల్గొన్న బిఆర్ఎస్వి రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆశ్వంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. జేఎన్టీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులతో కలిసి శాంతియుతంగా నిరసన తెలిపిన ఆయనను కేపిహెచ్బి పోలీస్ స్టేషన్కు తరలించారు. టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవో 29 రద్దుచేసి, జీవో 55 అమలు చేయాలన్నారు.