కన్నెపల్లి పంపుహౌస్ మోటర్లు ఆన్ చేయాలి.. కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కాలేశ్వరం ప్రాజెక్ట్ లోని కన్నపల్లి పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ వద్ద గోదావరి వరద నీటిని పరిశీలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోటర్లు వెంటనే ఆన్ చేయకపోతే తమ పార్టీ బృందం ఆన్ చేస్తుందని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులు, కుంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయని వెంటనే లక్ష్మీ పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ బృందం డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు