సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని బిఆర్ఎస్ మల్లారెడ్డి అన్నారు. ఇందుకు పీఎం మోడీ కూడా వేలకోట్లు కేటాయిస్తూ సహకరిస్తున్నారని తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఒకప్పుడు ఏపీలో అమ్ముకుని తెలంగాణలో కొనేవారు. ఇప్పుడు అక్కడ అమ్ముకొని ఇక్కడ కొనే పరిస్థితి తలెత్తింది. కెసిఆర్ మళ్ళీ సీఎం కావాలి అని ఆయన ఆకాంక్షించారు.