ప్రకాశం జిల్లా తర్లపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులకు ఇంటింటికి ఇంకుడు గుంతలు కట్టించవలసిందిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతుంది అని ప్రజలందరూ కూడా సహకరించేలా అవగాహన కల్పించాలని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఓ ఏపీఎం ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.