బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఉదయం 6 గంటల నుండి రైతులు భారీగా క్యూ లైన్ లో బారులుదీరారు. గత నాలుగు రోజులుగా సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం యూరియా వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు ఉదయం 6 గంటల నుండి భారీగా క్యూ లైన్ కట్టారు. ఒక పట్టాదార్ పాసు పుస్తకానికి, ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వనప్పుడు రైతుల కోసం సొసైటీలు ఎందుకు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.