ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రు కాలనీలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గురువారం మధ్యాహ్నం 2:45 పెద్ద బండరాయి గుట్ట పై నుండి జారి ఇంటి ముందు భాగంలో పడడంతో ఇంటి ముందు భాగం ధ్వంసం అయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు.