వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, రూ.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే సీఐ రమణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన రమేష్ పై పలు చోరీల ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు.