మియాపూర్ డివిజన్ పరిధిలోని దత్త సాయి నగర్ కాలనీలో ప్రతిష్టించిన గణనాథుడిని శనివారం మధ్యాహ్నం ఆరికె పూడి గాంధీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. గణపతిని నియమనిష్ఠలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.