విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజరాజేశ్వరి పేట లోని హెల్త్ క్యాంపు సెంటర్ వద్దకు గద్వాల్ నరసింహను కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లారు అప్పటికే శ్వాస అందకపోవటంతో పిసిఆర్ చేశారు. హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి అధికారులు తరలించారు. సదరు వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.