రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల రూపాయల విలువగల చెక్కులను,56 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 56 లక్షల 6వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.రాయికల్ పట్టణ గుడేటి రెడ్డి సంఘంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం సహాయనిది,కళ్యాణ లక్ష్మీ పథకం అమలుతో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగంగా మారిందనీ, ఆర్థిక భారం తగ్గిందన్నారు.రాయికల్ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తాననీ ..