ఆసిఫాబాద్ పట్టణంలో రోడ్లమీద విశృంఖలంగా సంచరిస్తూ, వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను గోశాలకు తరలించేస్తామని ASF సీఐ బాలాజీ వరప్రసాద్ హెచ్చరించారు. బుధవారం CI మాట్లాడుతూ.. పట్టణంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలించేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యల ఉత్పన్నంతో పాటు, వాహన చోదకులు ప్రమాదాలకు గురవడానికి రోడ్లపై సంచరించే పశువులే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని, అలాంటి చర్యలను అడ్డుకోవడానికి తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.