జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆక్వా జోనేషన్ విస్తీర్ణంపై గ్రామ స్థాయిలో తనిఖీ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని మండల స్థాయి అధికారులకు ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సాయంకాలం 5 గంటలకు జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులు రెండు రోజులలోపు సమావేశం జరిపి పూర్తి నివేదికను జిల్లా కమిటీకి పంపించాలని సూచించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు బి.శివన్నారాయణ రెడ్డి, అయ్యా నాగరాజ, జెడ్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.