కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వికలాంగుల పెన్షన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం గేట్లు ఎక్కి కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని ఆరోపించారు. వికలాంగులకు 6000, వృద్ధులకు, వితంతువు ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఇస్తానని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.