యూరియా సరఫరాలో జాప్యం లేకుండా పంపిణీ చేస్తున్నాం. కూపన్లు ఇచ్చిన రైతులకు యూరియా సరఫరా.వైరా ఏడిఏ తుమ్మలపల్లి కరుణశ్రీ ఏన్కూర్ యూరియా సరఫరా లో రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయటం జరుగుతుందని. వైరా ఏడిఏ తుమ్మలపల్లి కరుణశ్రీ అన్నారు. ఆదివారం ఏన్కూరు సొసైటీ కార్యాలయంలో యూరియా పంపిణీ ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యూరియా కోసం డిమాండ్ కు సరిపడా యూరియా లేకపోవడంతో, ఆరోజు రైతులకు కూపన్లు ఇవ్వడం జరిగిందని, ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ, కూపన్లు ఇచ్చిన రైతులకు ఇబ్బంది కలక్కుండా ఏన్కూర్ లో స్టాక్ ఉన్న యూరియా వరకు పంపిణీ చేయడం కోసం ఏఈఓ లను అందుబాటులో ఉంచడం జరిగింది