శుక్రవారం రోజున సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా బస్తాల టోకెన్ల కోసం రైతులు తోపులాడుకున్నారు 20 రోజులుగా యూరియా బస్తాలు అందక ఇబ్బందులకు గురవుతున్నామని ఈరోజు యూరియా టోకెన్లు ఇస్తారని పేర్కొనడంతో ఉదయం నాలుగు గంటలకు చేరుకున్న రైతులు ప్రాథమిక సహకార సంఘ కేంద్రం తెరవగానే తోపులు ఆడుకున్న పరిస్థితి నెలకొంది రైతులను అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అదుపు చేసేందుకు ముందడుగు వేశారు