ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ లో శుక్రవారం ఒకేషనల్ విద్యార్థులకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపల్ మురళి తెలిపారు. ప్రిన్సిపల్ విద్యార్థులకు మూత్రపిండాలు గుండె పనిచేసే విధానంపై ప్రాక్టికల్ గా చేసి చూపించారు. విద్యార్థులకు పనిచేసే ప్రదేశంలో ఎలా పని చేయాలో వారికి ప్రాక్టికల్స్ గా చూపించడం జరిగిందన్నారు. ఇండస్ట్రియల్, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీస్ వంటి అంశంలో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలానే పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యార్థులను ప్రాక్టికల్ గా చూపించారు.