యాడికి పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసముండే కరణం సుబ్బారావు అనే అనాధ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. సమాచారం తెలుసుకున్న యాడికి కి చెందిన మే ఐ ఎల్ యు ఫౌండేషన్ సభ్యులు బాలకృష్ణ,వేణు,సుధాకర్,అశోక్ కుమార్ స్పందించారు.కరణం సుబ్బారావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.హిందూ సంప్రదాయబద్ధంగా సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించి అందరీ చేత శభాష్ అనిపించుకున్నారు.