మచిలీపట్నం లో వైసీపీ చేపట్టనున్న 'అన్నదాత పోరు' కార్యక్రమం పోస్టర్ను మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్, నేతలు పేర్ని కిట్టు, ఉప్పాల రాము ఆవిష్కరించారు. ఈనెల 9న యూరియా కొరత, రైతుల సమస్యలపై ఆర్డీఓ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు.