జగిత్యాల జిల్లాలో యూరియా కష్టాలు తీరటంలేదు.. రాయికల్ మండలం అల్లీపూర్ సహకార సంఘాం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు క్యూ కట్టారు.. బుధవారం ఉదయం నుండి లైన్‌లో గ్రామ రైతులు బండలు, కాగితాలు, చెప్పులు పెట్టి లైన్లో నిలుచొని వేసి చూశారు.. యూరియా రాగానే రైతులు ఎగబడ్డారు.. యూరియా కష్టాలు తీర్చాలని, తగినంత యూరియా ఇవ్వాలని ఒక్క బస్తా ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని వెంటనే యూరియా కొరత లేకుండా చూడాలని అందరికీ అందుబాటులోకి యూరియా వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నదాతలు కోరారు.