కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం బుధవారం పత్తికొండలోని 4వ సచివాలయంలో వైద్యాధికారి సుజాత ఆధ్వర్యంలో జరిగింది. ఆరోగ్య వంతమైన మహిళ కుటుంబానికి బలమని ఆమె పేర్కొన్నారు. గర్భిణీలు, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి టీకాలు వేశారు. అంగన్వాడి సెంటర్ల ద్వారా అందుతున్న పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని గర్భిణీలకు సుజాత సూచించారు.