నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం దగ్గర బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రభాస్ అనే యువకుడు మృతిచెందగా ఉమేష్ అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన యువకుడిని డోన్ పట్టణముగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు