అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో బుధవారం జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ అయిందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు.కళ్యాణ దుర్గం లోని ప్రజా వేదికలో గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల్లో 80 శాతం హామీలు నెరవేర్చామన్నారు.కళ్యాణదుర్గం అభివృద్ధికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారన్నారు.బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. సీఎం చెప్పారన్నాసూపర్ సిక్స్ -సూపర్ హిట్ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.