పీలేరు మండలం పీలేరు పట్టణంలోని బి.వి. రెడ్డి నగర్ వద్ద ఆర్ఓబి క్రింద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ప్రమాదవశాత్తూ కాలిపోయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్లక్ష్యం కారణంగా మంటలు అంటుకుని విగ్రహంతో సహా మండపం కాలి పోయినట్లు ఆరోపించారు.అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున మంటలను చూసిన స్థానికులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రతీ ఏటా భక్తి శ్రద్ధలతో గణనాథుడిని ప్రతిష్టించే ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.