శ్రీకాకుళం జిల్లాలో గడిచిన తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఓ హత్యకు సంబంధించిన మిస్టరీ శుక్రవారం వీడింది నరసన్నపేటకు చెందిన బంగారు వ్యాపారి పుట్నూరు పార్వతీశం గుప్త ఆగస్టు 26వ తేదీన హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు విశాఖపట్నంలోఒక కేజీ బంగారం కొనుగోలు చేసి శ్రీకాకుళం వస్తుండగా బంగారు వ్యాపారికి చెందిన కారు డ్రైవర్ తో పాటు పెదపాడు పరిధిలోని కార్ డెకరేట్స్ చెందిన మరో వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతము నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసును శ్రీకాకుళం, నరసన్నపేటకు చెందిన జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.