దాహేగం మండలం బోర్లకుంట గ్రామ సమీపంలోని వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. వాగు వైపు వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.