బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే. ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం వరకు పొడి వాతావరణం కనిపించిన రాత్రి అయ్యేసరికి అకస్మాత్తుగా బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని శుక్రవారం వెల్లడించింది. అయితే ప్రస్తుతం కురిసిన వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ వెల్లడించవలసి ఉంది.