నంద్యాల జిల్లా డోన్లో ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా దుష్పరిణామాలు జరగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేంద్ర, ఏఈ నాగేశ్వర రెడ్డి శనివారం తెలిపారు. విగ్రహాలు బయలుదేరే సమయం నుంచి నిమజ్జనం పూర్తి అయ్యే వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వెల్లడించారు. రహదారిలో జాగ్రత్తగా ప్రయాణించాలని, అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అధికారులను సంప్రదించాలని సూచించారు.