కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి పుష్ప పల్లకి సేవ ఘనంగా ప్రారంభం ప్రారంభమైంది. అన్ని రకాల పుష్పాలతో ముస్తాబైన పల్లకిపై ఊరేగుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు. స్వామివారి దర్శనార్థనికి వేలాదిమంది భక్తులు తరలివచ్చి జనసంద్రంగా మారింది. క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరి నిలబడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలను కల్పించారు. మాడవీధుల్లో స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులు టెంకాయలు కొట్టి ముక్కులు తీర్చుకున్నారు.