బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది కర్ణాటక ప్రాజెక్టుల నుండి విడుదల చేసిన నీటితో జూరాల నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టుకు రెండు లక్షల 72 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుందని, దాంతో 2,51,578 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలియజేశారు కుడి కాల్వకు 700, ఎడమ కాలువలకు 800, నీరు వదులుతున్నట్లు అధికారులు తెలియజేశారు. మొత్తానికి 2,82,268 క్యూసెక్కుల నీటిని దిగివకు వదులుతున్నట్లు తెలిపారు.