యాదాద్రి భువనగిరి జిల్లా బోనగిరి పెద్ద చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను ఆర్డిఓ కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డితో కలిసి వాహనాల పార్క్కి చెరువులోకి వాహనాల రాకపోకలపై చర్చించారు. విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.