విజయనగరం జిల్లా రాజాం మండలంలోని కంచరాం గ్రామంలో నాణేలతో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. 7వేల వరకు రూపాయి, రెండు, పది రూపాయల నాణెములను ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు.. ఈ సంవత్సరం నాణెములతో చేయడం చాలా సంతోషంగా ఉందని, నిమజ్జనం రోజు అన్న సమారాధన చేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు... ప్రతి ఏటా వినూత్న రీతిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేస్తూ వస్తున్నామన్నారు. నాణాలతో ఏర్పాటు చేసిన గణనాధుడిని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.