మైలవరం నియోజకవర్గంలో జి కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9:30 సమయంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నడుచుకుంటా వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టింది. గ్రావెల్ లారీ ఢీకొనడంతో గంజి షారోన్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధ్యత కుటుంబ సభ్యు లు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.