గత రాత్రి గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగడిగుంట గాంధీనగర్ మూడవ లైన్లో యువకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మణికంఠ అనే యువకుడు మృతి చెందాడు. గత రాత్రి కొండ వెంకటప్పయ్య కాలనీ కి చెందిన యశ్వంత్ మరో 15 మంది యువకులు తమ ఇంటి వద్దకు వచ్చి తమ కుమారుడు మణికంఠ పై దాడి చేసినట్లు మృతుడు మణికంఠ తండ్రి తెలిపాడు. మణికంఠ కు తీవ్రమైన గాయాలు కావడంతో గత రాత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.