సప్తగిరి కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి లాంగ్ మెమో ఇవ్వడం లేదంటూ పేరెంటు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆ పాఠశాల యందు నిర్వాహలను కలిసేందుకు వెళ్లగా అక్కడ సంబంధిత నిర్వాహకులు లేకపోవడంతో ఆ గదికి తాళం వేశారు. తన కుమార్తె లాంగ్ మెమో ఇవ్వాలంటూ గత 15 రోజుల నుండి స్కూలు యాజమాన్యాన్ని కోరడం జరిగిందని కానీ పట్టించుకోకుండా ఇబ్బందులు పాలు చేస్తూ సమయం వృధా చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం రోజున తన కూతురి పై చదువుల కోసం చివరి తేదీ కావడంతో అత్యవసరంగా ఉండటంతో గత పదిహేను రోజులుగా విన్నవించుకున్నప్పటికీ తమ దగ్గర లేదంటూ కుంటి సాకులు చెప్తున్నారని అవేదన చెందారు.