జుక్కల్ లో లంబాడ హక్కుల పోరాట సమితి బహిరంగ సభ... కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభనిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బీబీ పటేల్, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, గంగారాం హాజరై మాట్లాడారు. గోర్ బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం అధికారికంగా ప్రకటించాలన్నారు. లంబాడీల సాంప్రదాయం, సంస్కృతులను గౌరవించాలని అన్నారు. నాయకులు లక్ష్మణ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.