నల్లగొండ జిల్లాలోని యూరియా అక్రమ నిలువలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ శనివారం హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలోని యూరియాను పక్కదారి పట్టించిన అధిక ధరలకు విక్రయించిన పిడి యాక్ట్ కేసులు తప్పమన్నారు. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో 10 పర్టిలైజర్ షాపుల్లో అక్రమాలు బయటపడ్డాయి అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీలు ఆగ్రోస్ దుకాణాల ద్వారా యూరియా సరఫరా కొనసాగుతుందన్నారు పార్టీలైజర్ యాజమాన్యులు స్టాక్ ధరల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.