పీలేరు మండలం అగ్రహారం గ్రామం కమ్మ మిట్టపల్లిలో వరి పంట సాగు చేస్తున్న రైతులకు యూరియా వాడకంపై పీలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు వైవి రమణరావు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఎ రమణారావు మాట్లాడుతూ వరి పంట పండించే రైతులు ఎకరాకు రెండు బ్యాగులు యూరియా ను , మూడు విడతల్లో వేయాలని, వరి నాటే సమయంలో ఒక బ్యాగు 30 రోజుల సమయంలో అర బ్యాగు 60 రోజులు అంటే పొట్టు దశలో అర బ్యాగు యూరియా వాడుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఒక బ్యాగు యూరియా బదులు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా ఎకరాకు రెండవ, మూడవ దశలో పిచికారి చేసుకోవాలని వివరించారు.